టక్ జగదీష్ వచ్చేస్తున్నాడు

సెప్టెంబర్‌ 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో టక్‌ జగదీష్‌ ప్రసారం కాబోతుందంటూ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'నిన్ను కోరి' వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత నాని- శివ నిర్వాణ కలయికలో తెరకెక్కిన చిత్రం టక్‌ జగదీష్‌ . షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందంటూ గత కొంతకాలంగా వార్తలు ఊపందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే నిజమని క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్‌. 

'పండగకు మన ఫ్యామిలీతో..' అంటూ చిన్నపాటి ప్రోమోను సైతం హీరో నాని రిలీజ్‌ చేశాడు. ఇందులో నాని 'నాయుడుగారి అబ్బాయి టక్‌ జగదీష్‌ చెబుతున్నాడు.. మొదలెట్టండి' అంటూ ఫ్యాన్స్‌కు ఇప్పటినుంచే సంబరాలు మొదలెట్టమని సంకేతాలిస్తున్నాడు. ఈ సినిమా వినాయక చవితి రోజు ఓటీటీలో రిలీజ్‌ అవుతుండటంతో ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూడొచ్చని కొందరు సంబరపడుతుంటే, థియేటర్‌ ఫీల్‌ మిస్‌ అవుతాం అని మరికొందరు ఫ్యాన్స్‌ నిరుత్సాహం చెందుతున్నారు.
https://youtu.be/xVyvTLGOw2k

News Tags: