సీనియర్ యాక్టర్ అర్జున్ ఆంజనేయస్వామి భక్తుడు. ‘శ్రీఆంజనేయం’ సినిమాలో ఆయన హనుమంతుడి పాత్రధారిగా నటించారు కూడా. అలాగే రామబంటుపై తనకున్న భక్తితో చెన్నై విమానాశ్రయానికి దగ్గరలోని తన సొంత స్థలంలో గుడిని నిర్మించడం విశేషం. 15 ఏళ్లుగా జరుగుతున్న ఈ అలయం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. భక్తుల సందర్శనార్ధం గుడి సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అర్జున్ ఓ వీడియో విడుదల చేశారు. 15 ఏళ్లుగా నేను నిర్మిస్తోన్న ఆంజనేయస్వామి గుడి నిర్మాణం పూర్తయ్యింది. జూలై 1,2వ తేదీల్లో కుంభాభిషేకం నిర్వహిస్తున్నాం. స్నేహితులు, అభిమానులు, తెలిసిన వారందరినీ ఆహ్వానించాలని అనుకున్నాను. కానీ కొవిడ్ పరిస్థితుల కారణంగా వద్దనుకున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి లైవ్ ఏర్పాటు చేస్తున్నాను. దీనికి సంబంధించిన లింక్స్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూడొచ్చు అని తెలిపారు.