వైసీపీ ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ : దేశం నేత జి.వి

వైసీపీ ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తయారైందని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఉద్యోగుల సమస్యల్ని పక్కదారి పట్టించడానికి, గుడివాడ క్యాసినో భాగవతంపై ఉన్న ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలసీని అవలంబిస్తోందని విమర్శించారు.

అందుకే జిల్లాల విభజనను తెరపైకి తీసుకొచ్చిందన్నారు. జనాభా లెక్కలు పూర్తయ్యేదాక జిల్లాల విభజన వద్దు అని గతంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అయినా వైసీపీ ప్రభుత్వం కేవలం తన స్వలాభం కోసం డైవర్షన్ పాలసీ చేయడం దురదృష్టకరమన్నారు. ఒక శాస్త్రీయ పద్దతి లేకుండా ఇష్టారాజ్యంగా జిల్లా కేంద్రాలను నిర్ణయించారన్నారు. జిల్లాల్లో ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత వస్తోందన్నారు.

 రాష్ట్ర సమస్యలను మరచిపోవడానికి జిల్లాల విభజనను అడ్డం పెట్టుకుంటోంది. జిల్లా కేంద్రాలను నిర్ణయించడంలో స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. జిల్లాలకు పేర్లు పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టటం దుర్మార్గమన్న జివి, గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని ప్రజలు మరచిపోరన్నారు. ఉద్యోగులు, ప్రజలను అమాయకులనుకోవద్దని, సమయమొచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతారన్నారు. జిల్లా కేంద్రం సెంటర్ పాయింట్ గా ఉండాలన్న విధానం  అమరావతి రాజధానికి ఎందుకు వర్తించదు?  వైజాగ్ ఎక్కడో ఒక మూలన ఉంది. దాన్ని ప్రభుత్వం రాజధానిగా ఎలా ప్రతిపాదిస్తుందని నిలదీశశారు. 

 రాజకీయాలకు అతీతంగా, స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా జిల్లాల విభజన జరగాల్సిన అవసరముందన్నారు.. ప్రజల సౌలభ్యం కోసం జిల్లా కేంద్రం ఉండాలన్నరు. అదే క్రమంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెబుతూనే ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి నిధులు లేవంటూనే ప్రభుత్వం జిల్లాల మౌలిక వసతుల కల్పనకు నిధులు ఏవిధంగా సమకూరుస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.

కొత్త జల్లాలు ఏర్పాటు చేయాలంటే ఒక్కొక్క జిల్లాకు 3 వందల నుండి 4వందల కోట్లు ఖర్చవుతుంది. ఎక్కడినుంచి తెస్తారు? ప్రభుత్వం స్వప్రయోజనాలను మాని శాస్త్రీయ విధానాన్ని, ప్రజల ఆమోదాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాల విభజన చేయాలని సూచించారు. కృష్ట జిల్లాలో అన్న ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నామన్న ఆయన  ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్న ఎన్టీరామారావు మీద గౌరవం ఉంటే రాజధానిలో ఉన్న ఎన్టీఆర్ స్మృతివనం నిర్మాణానికి నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.  

మూసివేసిన అన్నా క్యాంటిన్లను మళ్లి ఎన్టీఆర్ పేరుమీదనే అన్నా క్యాంటిన్లను తెరిపించాలని కోరారు.  ప్రభుత్వానికి రివర్స్ పాలన మొదలైందన్నారు.  రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల విభజన చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.. ఉద్యోగస్థులకు న్యాయం చేయాల్సిన అవసరముందని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వివరించారు.

News Tags: