ఉద్యోగుల ఉద్యమ సక్సెస్ ప్రస్తుతం ఏపిలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు నిర్బంధాలను దాటికొని భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకొని, ప్రభుత్వంకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించడం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తున్నట్లు కనిపిస్తున్నది.
ప్రభుత్వ ఆదేశాలను పోలీస్ వర్గాలు గాలికి వదిలేసి, ఉద్యోగుల `చలో విజయవాడ’ కార్యక్రమంకు సహకారం అందించినట్లు వెల్లడి అవుతున్నది. అంటే ఒక విధంగా రాష్ట్ర పోలీసులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై `తిరుగుబాటు’ ధోరణిని బహిరంగంగా ప్రకటించినట్లు స్పష్టం అవుతున్నది.