jagan

వైసీపీ ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ : దేశం నేత జి.వి

వైసీపీ ప్రభుత్వం డైవర్షన పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తయారైందని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఉద్యోగుల సమస్యల్ని పక్కదారి పట్టించడానికి, గుడివాడ క్యాసినో భాగవతంపై ఉన్న ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలసీని అవలంబిస్తోందని విమర్శించారు.

రాజధాని విషయంలో వెనక్కు తగ్గిన జగన్ సర్కార్

మూడు రాజధానుల చట్టాలను ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ సోమవారం ఈ విషయాన్ని తెలియజేశారు.

ఏజీ ప్రతిపాదనను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు నిర్ణయాల్ని ఏపీ కేబినెట్‌ వెనక్కి తీసుకుంది. సీఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీలో మూడు రాజధానుల నిర్ణయం గురించి ప్రకటన చేయనున్నారు.

జగన్ సర్కార్ పై కమలం ఇక దూకుడే...

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ బలోపేతం కావడానికి  కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీ నాయకులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో అధికారమలో ఉన్న వైసిపి ప్రభుత్వం అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం జరపాలని స్పష్టం చేశారు. వైసిపి, టిడిపిలకు సమదూరం పాటిస్తూ, సొంతంగా పార్టీని అభివృద్ధి చేసుకోవడం పట్ల దృష్టి సారించాలని హితవు చెప్పారు. 
 

జగన్ పై జనాగ్రహం మొదలైంది ; దేశం నేత జి.వి

ముఖ్యమంత్రి పిలుపుతో నిర్వహించిన జనాగ్రహదీక్షల్లో జగన్‌పై ఉన్నజనాగ్రహం బట్టబయలైందని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టుమని 20 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జనాగ్రహ దీక్షలు జరగలేదన్నారు. చంద్రబాబు దీక్షను తప్పుపడుతున్న తాడేపల్లి పాలేరు సజ్జల సీఎం పదవి కోసం గోతికాడనక్కలా ఎదురుచూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి డ్రగ్స్‌లో మునిగితేలుతూ, పబ్జీలు ఆడుకుంటుంటే సజ్జల షాడోసీఎంలా పెత్తనంచలాయిస్తున్నారని అన్నారు. అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకుపోతాడా.. ఎప్పుడు సీఎం కుర్చీ దక్కుతుందా అని నక్కినక్కి చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

అయోమయంలో ఆంధ్ర బిజెపి

ఏపిలో భారతీయ జనతా పార్టీ పరిస్ధితి అయోమయంగా తయారైంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని కేంద్రంలోని బిజెపి పెద్దలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ భాజాపా పరిస్ధితి భిన్నంగా మారింది. అధికార సాధన దిశగా బిజెపి పెద్దలు ప్రయత్నాలు చేస్తుంటే స్ధానిక నేతలు కొందరు మాత్రం అధికార పార్టీ తొత్తులుగా మారారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఎపి సర్కార్ కు చిరంజీవి ప్రసంశలు

ఎపి ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు జల్లు కురిపించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం జగన్ సర్కారు పనితనానికి నిదర్శనమని కొనియాడారు. కోవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నం బాగుందని, ఒక్కరోజులో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించడం అభినందనీయమని చిరంజీవి ప్రశంసించారు.

వైయస్సార్ చేయూత మహిళల ఖాతాల్లో‌ జమ

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు అక్క చెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వరుసగా రెండో ఏడాది 23,14,342 మంది మహిళలకు రూ.4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 

వైయస్సార్ చేయూత ; ఖాతాల్లో‌ నగదు జమ నేడే

అమరావతి; వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూతను రేపు మంగళవారం క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదును ఎపి సీఎం వైఎస్‌ జగన్‌ జమచేయనున్నారు. అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్సార్‌ చేయూత. పేద అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్ళలో దాదాపు రూ. 19,000 కోట్ల సాయం అందించే కార్యక్రమంలో భాగంగా వరసగా రెండో ఏడాది 23,14,342 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 4,339.39 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు

Subscribe to RSS - jagan