భారతీయుల వంటల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం.. అంతేకాదు నీరుల్లి కంటే కూడా వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువ. ఇక వెల్లుల్లి వేసిన వంటలు చక్కని రుచి, వాసన వస్తాయి. ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్ని కత్తిరించేది, కేన్సర్ ను నిరోధించేది.. రక్తపు పోటుని నివారించేది.. వీర్యాన్ని వృద్ధి చేసేది, తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది, ఇలా శరీరంలోని ఇంకా వ్యాధులకు చెక్అ పెట్టె శక్తి వెల్లుల్లికి ఉంది.