బీటీ పత్తిని కొన్నేళ్ళుగా గులాబీ పురుగు ఆశిస్తోంది. సెప్టెంబర్ , అక్టోబరు మాసాల్లో దీని ఉదృతి అధికంగా ఉంటుంది. ఖరీఫ్ లో ముందుగా వేసిన పంటను ఇది ఎక్కువగా ఆశిస్తుంది. పత్తిలో గులాబీ పురుగు బెడద రైతులకు తీవ్రనష్టాన్ని కలుగ జేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికసంఖ్యలో రైతులు పత్తిసాగు చేపట్టారు. 45 రోజుల కాలం పూర్తయిన పంటకు గులాబీ పురుగు ఆశిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పురుగును తొలిదశలో గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే పంటకు జరగబోయే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.