విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందా లేదా అన్నది మరోమారు చర్చనీయాంశమయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్లున్నాయని, కొత్త జోన్లు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించడంతో విశాఖ జోన్‌పై మరోమారు చర్చకు తెరలేచింది.
అవసరాలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే డిమాండ్ల ఆధారంగా మరిన్ని రైల్వే జోన్లు మంజూరు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే ఆ వివరాలు చెప్పాలని బుధవారం లోక్‌సభలో అజయ్ నిషాద్ అనే సభ్యుడు అడిగారు. అలాంటి ఉద్దేశమేదీ లేదని రైల్వే మంత్రి సమాధానమిచ్చారు.