విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ధరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం ఖాళీలు 319 వాటిలో ఫిట్టర్ 75, టర్నర్ 10, మెషినిస్ట్ 20, వెల్డర్ 40, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 20, ఎలక్ట్రీషియన్ 60, కార్పెంటర్ 20, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ 14, మెకానిక్ డీజిల్ 30, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంటెంట్ 30 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్ లో ఎన్సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ అధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రకియ ఉంటుంది.