పాలవాళ్ల...ధూళ్ళిపాళ్ల

సహకార రంగ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ఘనమైన చరితం.. అంతటి ఘనత మరెవ్వరికీ దక్కలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే ధూళిపాళ్ళ పాలవాళ్ల ప్రియతమ నేత అయ్యారు. ఈ నెల 24న ఆయన వర్ధంతి సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. 

 ధూళిపాళ్ళ  వీరయ్య చౌదరి.. పరిచయం అవసరం లేని పేరు. పాల వాళ్ళసిరి గా సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఘనమైన చరిత్ర ఆయనది. ఆయన కన్ను మూసి 27  సంవత్సరాలు పూర్తయిన  పాల వాళ్ల గుండెల్లో మాత్రం తిరుగులేని ప్రస్థానాన్ని, మరువలేని స్థానాన్ని సంపాదించుకున్నారు. భారతదేశంలోనే సంగం డైరీ ఒక అత్యున్నత సహకార సంస్థ గా విరాజిల్లుతుందంటే దాని వెనుక ఒకప్పటి వీరయ్య చౌదరి అవిరళ కృషి, అవిశ్రాంత శ్రమ ఎంతో దాగి ఉంది. పాల వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించి వారిని ఎన్నో సందర్భాల్లో ఆదుకున్న మహనీయుడు గా, సంగం డైరీ రథసారధిగా ధూళిపాళ్ల వీరయ్య చౌదరి చేసిన కృషి కొన్ని మాటల్లోనో,    కొద్ది పుటల్లోనో వర్ణించటానికి వీలు కాని వ్యక్తిత్వం ఆయనది.

పరస్పర సహకారాన్ని అనుక్షణం పాల వాళ్ళు అందిపుచ్చుకునేలా ఆ రంగంలో ధూళిపాళ్ళ చేసిన నిర్విరామ కృషి నిలువెత్తు నిదర్శనానికి దర్పణం పడుతుంది. సుమారు ఐదు దశాబ్దాల క్రితం పొన్నూరు మండలం చింతలపూడి గ్రామానికి  సర్పంచ్ గా తొలి సారీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ధూళిపాళ్ళ సీనియర్ రాజకీయవేత్త యడ్లపాటి వెంకట్రావు శిష్యరికంలో ఎదిగారు.. అంచెలంచెలుగా రాజకీయంలో తన పట్టును నిలుపుకుంటూ వచ్చారు.

పొన్నూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యులుగా విజయం సాధించి 1989లో రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర చిత్ర పటం లోనే అరుదైన అగ్ర నాయకుల్లో ధూళిపాళ్ళ  వీరయ్య చౌదరి ఒకరని చెప్పటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. సంగం డైరీ రథసారధిగా ఆయన చేసిన కృషి ఫలితంగానే ఒక బలమైన రాజకీయవేత్తగా ఎదిగేలా చేసింది. సంగం డైరీ చైర్మన్ గా విశిష్టమైన పేరుప్రఖ్యాతులు గడించిన వీరయ్య చౌదరి అటు రాజకీయ రంగంలో కూడా తిరుగులేని సమర్థత కలిగిన రాజకీయ నాయకుడిగా కీర్తి పతాకాన స్ఫూర్తిప్రదాత గా నిలిచారు. తెలుగుదేశం పార్టీలో బలమైన క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన ధూళిపాళ్ల రెవెన్యూ మంత్రిగా ఆ శాఖకు వన్నె తెచ్చే విధంగా విశిష్టమైన సేవలు అందించారు. నియోజకవర్గంలో ప్రతి వారిని  పేరుపెట్టి పిలిచే ఆత్మీయ నేతగా ఎదిగారు.  

1989 లో రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సొంత నియోజకవర్గానికి విచ్చేసిన ధూళిపాళ్ల కు ఘనమైన స్వాగతం తో మొత్తం పొన్నూరు నియోజకవర్గం బ్రహ్మరథం పట్టింది. పదవి మత్తులో చిత్తశుద్ధి లోపిస్తే పార్టీ చిత్తు అవుతుందని ఆనాటి బహిరంగసభలో ధూళిపాళ్ళ చేసిన ప్రసంగం ఆయన రాజకీయ నైతిక విలువలకు దర్పణం పడుతుంది.  పార్టీని బలంగా అభివృద్ధి చేస్తూనే ప్రజా ప్రతినిధిగా పొన్నూరు నియోజకవర్గంలో  దూళిపాళ్ల చివరి వరకు కూడా ఒకే ఆశయం ఒకే లక్ష్యంతో పని చేస్తూ వచ్చారు. 1994 జనవరి 24వ తేదీన గుంటూరులో జరుగుతున్న  పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తిరిగి వస్తూ నారాకోడూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు .

ఒక బలమైన సిద్ధాంతంతో చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పని చేసిన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి  క్షీర  విప్లవ రథసారధిగా రెండు సార్లు శాసన సభ్యునిగా పనిచేసి ఆదర్శంగా నిలిచారు. సంగం డైరీ సిరిగా వీరయ్య చౌదరి నాటికి నేటికీ ఏనాటికీ పాల వాళ్ళ గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచే ఉంటారు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న మాజీ శాసన సభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ 5 సార్లు ఈ నియోజకవర్గానికి శాసన సభ్యులుగా పనిచేశారు. తాజాగా సంగం డైరీ చైర్మన్ గా సేవలందిస్తున్నారు.

తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నరేంద్రకుమార్ తండ్రి ఆశయ సాధన లో పునరంకితం అవుతున్నారు. ఇటు రాజకీయ రంగంలోనూ అటు సంగం డైరీ అభివృద్ధిలో నిరంతరం సేవలందిస్తున్నారు. ఈ నెల 24న ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా బాపట్ల, పొన్నూరు నియోజక వర్గాల్లోని పలు గ్రామాల్లో  ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నార

News Tags: