నల్ల పూసలు పెళ్ళైన మహిళలు ధరించాలా?..

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన ఆడవాళ్లు కొన్ని సాంప్రదాయాలను ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో  ముఖ్యంగా మంగళసూత్రం, కాలి మెట్టెలు, నల్లపూసలు ఇవన్నీ పెళ్లయిన తర్వాత ధరిస్తారు. ఈ విధంగా ఆభరణాలను ధరించడం మన సాంప్రదాయంలో ఒక భాగం అని చెప్పవచ్చు. ఆడవారికి అసలైన అందం ఇవే. కానీ ప్రస్తుతం ఉన్న ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా మంది నల్లపూసలు వేసుకోవటం లేదు. మరికొంతమంది మంగళసూత్రాలను కూడా అదేదో వేరే నగఅన్నట్లు బయటకు వెళ్లేప్పుడు అలంకార ప్రాయంగా వేసుకుంటున్నారు.  అయితే ఈ ఆభరణాలను ధరించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ఒక కారణం ఉంది. అయితే ప్రస్తుతం పెళ్లైన మహిళలు మాత్రమే నల్లపూసలు ఎందుకు ధరిస్తారో ఇక్కడ తెలుసుకుందాం

పూర్వకాలంలో పెళ్లి తర్వాత మహిళ మంగళసూత్రాన్ని నల్లపూసలలో వేసుకునే ధరించేది. పూర్వం ఈ నల్లపూసల నల్ల మట్టితో చేసేవారు. ఈనల్ల మట్టితో తయారుచేసిన పూసలను వేసుకోవడం ద్వారా ఆ పూసలు మన చాతి పై పడటం ద్వారా మన శరీరంలో ఉన్న వేడిని తొలగిస్తుంది. ఈ పూసలు ఛాతి మీద వరకు వేసుకునే వారు. కొంతమంది మంగళసూత్రాలలోనే రెండు పెద్ద నల్లపూసలు, రెండు ఎర్ర పూసలు వేసేవారు.  ఈ విధంగా నల్లపూసలు మన శరీరంలో వేడిని తగ్గించడం ద్వారా అనేక గుండె సంబంధిత సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. మట్టితో తయారు చేసిన నల్లపూసల దండను వధూవరులచే నీలలోహిత గౌరీకి పూజ చేస్తారు. ఈ విధంగా పూజలు చేయటం ద్వారా ఆ గౌరీ మాత అనుగ్రహం కలిగి వారు జీవితాంతం కలిసిమెలిసి సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా వధువు నిత్యం దీర్ఘసుమంగళీగా ఉండాలని భావించి ఈ గౌరీ వ్రతం చేస్తారు.

నీలలోహిత గౌరీ సన్నిధి నందు నల్లపూసల దండను ధరించటం వల్ల వధూవరులకు సంబంధించిన ఎటువంటి జాతక దోషాలైనా, సర్పదోషాలైనా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. అందువల్ల పూర్వకాలంలో పెళ్లైన మహిళలు మంగళసూత్రాన్ని నల్లపూసలలో మాత్రమే వేసుకుని ధరించే వారు. కానీ ప్రస్తుత కాలంలో మట్టితో తయారు చేసిన నల్లపూసలు కనుమరుగైపోయాయి. ప్రస్తుతం బంగారు షాపులలో రెడీమేడ్ పూసలు దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మహిళలు మంగళసూత్రాన్ని నల్లపూసలలో కాకుండా, బంగారు దండలో వేసుకోవటం ఫ్యాషన్ గా మారిపోయింది. మారుతున్న కాలంతో పాటు కొన్ని సంప్రదాయాలు కూడా మారిపోతున్నాయి. 

News Tags: