పత్తికి గులాబీ గుబులు..ఆందోళనలో రైతులు

బీటీ పత్తిని కొన్నేళ్ళుగా గులాబీ పురుగు ఆశిస్తోంది. సెప్టెంబర్ , అక్టోబరు మాసాల్లో దీని ఉదృతి అధికంగా ఉంటుంది. ఖరీఫ్ లో ముందుగా వేసిన పంటను ఇది ఎక్కువగా ఆశిస్తుంది. పత్తిలో గులాబీ పురుగు బెడద రైతులకు తీవ్రనష్టాన్ని కలుగ జేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికసంఖ్యలో రైతులు పత్తిసాగు చేపట్టారు. 45 రోజుల కాలం పూర్తయిన పంటకు గులాబీ పురుగు ఆశిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పురుగును తొలిదశలో గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు చేపడితే పంటకు జరగబోయే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

పంటకు గులాబీ పురుగు ఆశించిన పైరులో మొగ్గలు తెరుచుకోకపోవటం ముఖ్య లక్షణంగా గమనించవచ్చు. మొదటి తరం లార్వా మొగ్గలను తినేస్తుంది. పువ్వులుగా వికసించిన దశలో లార్వా పట్టు దారాలతో కనిపిస్తుంది. ఆతరువాత దశలో కాయల్లోని దూదిలోకి దూరి రంధ్రాలు చేసి విత్తనాలను తినేస్తాయి. ఈ పురుగు ఉదృతి పెరిగే కాయలు రాలిపోవటం, నల్లగా మారటం, నాణ్యత తగ్గటం వంటి నష్టాలు జరుగుతాయి.

కాయలపై పులిపురుల రూపంలో మచ్చలు వస్తాయి. గులాబీ రంగు పురుగులు బూడిద, గోధుమ రంగులో బాగా ఎదిగే కొద్ది గులాబీ రంగులోకి మారతాయి. ఈ గులాబీ రంగు పురుగుల ఉదృతి ఉండో లేదో తెలుసుకునేందుకు పొలంలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. రోజుకు 7నుండి 8 రెక్కల పురుగులు  పడితే ఉదృతి ఎక్కవగా ఉన్నట్లు గమనించాలి.ఇలాంటి సందార్భాల్లో వీటి తీవ్రత పెరగకముందే పంట కోతలు పూర్తిచేసుకోవటం ఉత్తమం. గులాబీ పురుగును తొలిదశలో గుర్తించిన వెంటనే ఎకరానికి వేపనూనె లేదా, క్లోరిఫైరిఫాస్ అరలీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 120 రోజుల వరకు ఎలాంటి సింథటిక్ ఫైరిత్రాయిడ్స్ ఉపయోగించరావు.

News Tags: