
పాతటైర్లే కదా అని ఈజీగా తీసి పారేయకండి...పనికి రాని టైర్లతో ఓ మహిళ సాహసోపేతంగా సాగిస్తున్న బిజినెస్ చూసి ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే నోరెళ్ళబెడుతున్నారు. ఇంతకీ దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే నైజీరియాలో వాడి పడేసిన పాత టైర్లు నల్ల బంగారంలా మారిపోయాయి. ఇప్పుడు వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
నైజీరియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఇఫిడేలాపో రాన్‌సేవే అనే మహిళా ప్రిటెన్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ రీసైకిలింగ్ కంపెనీని స్థాపించింది. రెండు సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరు వ్యక్తులతో చిన్న షెడ్ లో ఈ కంపెనీ ప్రారంభమైంది. రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, డ్రైనేజీ కాలువల్లో పడి ఉన్న పాత టైర్లను వీరంతా కలసి సేకరించేవారు. చాలా మంది ఎలా చేయటాన్ని చూసి ఎగతాళి చేసేవారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్న రాన్ సేవే పట్టుదలతో ముందుకు సాగారు. ఇందుకోసం తెలివైన ఆలోచన చేశారు.
వాటిని తమ రీసైకిలింగ్ ప్లాంట్‌కి తీసుకువచ్చి ప్రత్యేక పద్దతిలో కరిగించి పేవ్‌మెంట్ బ్రిక్స్‌గా తయారు చేశారు. రీసైకిలింగ్ పద్దతిలో తయారు చేసిన పేవ్‌మెంట్ బ్రిక్స్ క్వాలిటీ రోడ్లు, పార్కులు, పాఠశాల ఆవరణల్లో వీటికి వేసేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపించారు. అంతే దీంతో ఒక్కసారిగా ఆమె కంపెనీకి ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. పాత మెషినరీ స్థానంలో కొత్త మెషినరీ ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ స్థాయిలో బ్రిక్స్‌ను అందివ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండేళ్లలోనే నలుగురితో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు 128 మందికి చేరుకుంది.
పేవ్‌మెంట్ బిక్స్‌తో పాటు మరికొన్ని ఇతర ఉత్పత్తులు కూడా తయారు చేస్తోంది రాన్‌సేవే. ఈమె ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాంటుకు పాత టైర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఒక్కో టైరుకు 0.20 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.15 చెల్లిస్తున్నారు. దీంతో కరోనా ఉపాధి కరువైన వారంతా పాత టైర్ల వేటలో పడ్డారు. ఎక్కడ టైరు కనిపించినా వాటిని పోగేసి ఈ ప్లాంటుకు తెస్తున్నారు. దీంతో రన్‌సేవే సక్సెస్‌పై రాయిటర్స్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. దేశాలకు అతీతంగా అన్ని చోట్ల బంగారానికి విలువ ఉంది. మన దగ్గర పత్తిని తెల్లబంగారమని, బొగ్గుని నల్ల బంగారమని అంటుంటాం. ఇదే తరహాలోనే పాత టైర్లను బ్లాక్ గోల్డ్ అనక తప్పేట్టులేదు.