చదువుకున్న రైతు తెలివైన ఆలోచన లక్షలు తెచ్చిపెట్టింది.. ఎలాగంటే?..

సేధ్యపురంగం లాబసాటి కాదని తెలిసి చాలా మంది రైతులు మరో దారిలేక భూమిని నమ్ముకుని  బ్రతుకుపోరు సాగిస్తున్నారు. వ్యవసాయాన్ని తమ జీవనాధారంగా మార్చుకుని కాలం వెళ్ళదీస్తున్నారు. అలాంటి వారిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన రైతు కూడా ఒకరు. అతను చేసిన తెలివైన ఆలోచన ప్రస్తుతం ఆతనిడిని లక్షాధికారిగా మార్చింది. ఉన్న ఎకరం పొలంతోనే 7ఏళ్ళ కాలంలో ఏకంగా 17లక్షల రూపాయలను సంపాదించాడు. అతని విజయగాధ ప్రస్తుతం రైతులకు అదర్శంగా మారింది. వివరాల్లోకి వెళితే.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరికి చెందిన సాకేతు గ్రామానికి చెందిన 65 యేళ్ల సురేశ్‌ చంద్ర వర్మ బీఏ, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నాడు. చిన్ననాటి నుండి వ్యవసాయంటే ఎనలేని మక్కువ...తాతలు తండ్రులు వ్యవసాయాన్ని నమ్ముకునే జీవనం సాగించారు. వ్యవసాయం ద్వారా వచ్చిన అదాయంతోనే సురేశ్ చంద్ర వర్మ తన పై చదువులు కొనసాగించారు. అందుకే ఆయనకు పూర్వికుల అనుసరించిన సేధ్యపురంగాన్ని వదలిపెట్టలేకపోయాడు. తల్లిదండ్రులు ఇచ్చిన  పొలంలో వర్మ రకరకాల పంటలను పండించడం ప్రారంభించాడు. చెరకు, వరి, గోధుమ వంటి పంటలు పండించడంలో ఆరితేరాడు. అంతేకాకుండా మామిడి, ఉసిరి, లీచీ, నిమ్మ వంటి ఉద్యాన పంటల సాగులోనూ నిష్ణాతుడే. అంతర పంటల ద్వారా అధిక అదాయాన్ని పొందాడు. 

ఈ క్రమంలోనే సరిగ్గా నాలుగేళ్ళ క్రితం పంత్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి 25రూపాయల చొప్పున 234 వెదురు మొక్కలు కొనుగోలు చేశాడు. తన ఎకరం పొలంలో వాటిని నాటుకున్నాడు. వెదురుతోపాటు అదే పొలంలో అంతర పంటగా చెరకును మూడేళ్ళపాటు సాగుచేశాడు. నాలుగో సంవత్సరంలో కేవలం వెదురును పంటను మాత్రమే కొనసాగించాడు. వర్మ తన పొలంలో నాటిన ఒక్కో వెదురు మొక్క నుండి 40 నుండి 50 వెదురు బొంగుల ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రామాల్లో ప్రస్తుతం వెదురు బొంగులకు మంచి డిమాండ్ ఉంది. వసారాలు, ఇళ్ళ నిర్మాణాలతోపాటు, వివిధ కళాకృతుల తయారీకి వెదురును విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈక్రమంలో వెదురు బొంగు ధర ఒక్కింటికి 150 రూపాయలు పలుకుతుంది. 234 వెదురు మొక్కలకు గాను మొక్కకు 50 వెదురు బొంగులు లెక్కన వేసుకుంటే 11,700 వెదురు బొంగుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఒక్కో వెదురు బొంగు 150 రూపాయలకు విక్రయిస్తే అతనికి 17లక్షల రూపాయలకు పైగా అదాయం సమకూరనుంది. 

వెదురు పంట పూర్తిగా చేతికి వచ్చేందుకు ఏడేళ్ళ సమయం పడుతుంది. ఎకరం భూమిలో ఏడేళ్ళ సమయంలో 17లక్షల రూపాయల అదాయాన్ని ఒక్క వెదురు పంట ద్వారా ఆర్జింటమంటే సామాన్యమైన విషయం కాదు. అంతేకాకుండా గత మూడేళ్ళుగా వెదురులో అంతర పంటగా చెరకును సాగు చేసి మంచి లాభాలనే ఆర్జించాడు సురేష్ చంద్ర వర్మ. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు వర్మ చేసిన తెలివైన ఆలోచనను అంతా మెచ్చుకుంటున్నారు. రైతులంతా వర్మను ఆదర్శంగా తీసుకునే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే ప్రయత్నం చేయాలని పిలుపునిస్తున్నారు.

News Tags: