
కొంతకాలంగా నాగ చైతన్య, సమంత విడిపోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పష్టతనిచ్చాడు చైతూ. తానూ, సమంత విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత, అక్కినేని నాగచైతన్య వేరుకుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో అధికారికంగా ప్రకటించారు. చైతూ – సమంత విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికలపై సమంత తన పేరు వెనుక అక్కినేని సర్ నేమ్‌ను తొలగించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
సమంత నిర్ణయం ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు సినీ అభిమానుల మధ్య చర్చనీయాంశమయ్యింది. అప్పటి నుంచే సమంత ,చైతూల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న ప్రచారం గుప్పుమంది. సమంత, నాగ చైతన్యల మధ్య వివాహ బంధం బీటలువారిందన్న ప్రచారం సోషల్ మీడియాలోనూ జోరుగా సాగుతోంది.మొన్నటికి మొన్న చైతూ లేకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళ్లిన సామ్.. వారితో కలిసి అక్కడ తెగ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత రెండు మాసాలగా చైతూ ఫోటోలు ఏవీ సమంత షేర్ చేయకపోవడం..
మొన్నటికి మొన్న చైతూ లేకుండా ఫ్రెండ్స్‌తో కలిసి సమంత గోవా ట్రిప్‌కు వెళ్లడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న వార్తలకు మరింత ఊతమిచ్చింది. ఇటీవల అక్కినేని నాగార్జున బర్త్ డే వేడుకలకు సమంత హాజరుకాకపోవడానికి కారణం ఇదేనని మీడియా వర్గాలు తేల్చేశాయి. అయితే దీనిపై ఇటు సమంత, అటు చైతూ లేదా నాగార్జున ఫ్యామిలీ నుంచి ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు.
https://twitter.com/chay_akkineni/status/1444241025430536194?ref_src=tws...