వెండి తెరపై మరో నందమూరి వారసుడు ఎంట్రీ...ఎప్పుడంటే?..

Mokshagna: ఇప్పటికే సినీ ఇండస్ట్రీ వారసులతో నిండిపోయింది. దాదాపు 80 శాతం మంది వారసులే. ఏమాత్రం సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా వెంటనే ఆ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు.

ఇప్పటికే సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా వెండి తెర మీద కాలు పెట్టబోతున్నట్టు వార్తలు వెల్లువెత్తున్నాయి.

ఇప్పటికే బాలయ్య వారసుడి ఎంట్రీ చాలా లేట్ అయ్యిందనీ నందమూరి అభిమానులు ఫీల్ అవుతున్నారు. గత 19 ఏండ్లుగా నందమూరి కుటుంబం నుంచి కొత్త హీరోలు వచ్చిన దాఖాల్లేవు. కేవలం ఆ నలుగురు ముఖాలే తెర మీద కనిపిస్తున్నాయని నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్న సమయంలో త్వరగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని చెప్పకనే చెప్పేశాడు. ఎన్నో యేండ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఫిట్ గా లేకపోవడంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కాస్త లేట్ అయిందనే వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో మోక్షజ్ఞ వెండి తెర మీద కాలు బెట్టబోతున్నరని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని బాలయ్య చెప్పారు. అయితే మోక్షజ్ఞ తొలి సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించాలని బాలయ్య అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం వంటి వైవిధ్యమైన సినిమాలు తీసి.. సూపర్ డూపర్ హిట్లు అందించిన క్రిష్ . నందమూరి నట వారసుడితో ఎలాంటి సినిమాను తీయబోతున్నడనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలో మోక్షజ్ఞ తొలి సినిమా గురించి మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

 

News Tags: