మౌంటెన్ డ్యూ యాడ్.. మహేష్ ముందు తేలిపోయిన హృతిక్..!

సూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ తన సత్తా చాటుతూ వస్తున్నారు. కెరీర్ లో ఫస్ట్ టైం త్రివిక్రమ్ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు మహేష్. అయితే తెలుగు సినిమాలతోనే మహేష్ కు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. కేవలం సినిమాలే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో మహేష్ తమ హవా కొనసాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు శీతల పానీయం థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ లాస్ట్ ఇయర్ నుంచి మౌంటెన్ డ్యూ కి షిఫ్ట్ అయ్యాడు.

సమ్మర్ వస్తున్న కారణంగా కూల్ డ్రింక్స్ యాడ్స్ మొదలు అయ్యాయి. లేటెస్ట్ గా మౌంటెన్ డ్యూ కోసం మహేష్ కొత్త యాడ్ ఒకటి రిలీజైంది. సౌత్ లో మహేష్ నార్త్ సైడ్ హృతిక్ రోషన్ మౌంటెన్ డ్యూకి బ్రాండింగ్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన యాడ్ ని కూడా ఇద్దరు చేశారు.

అయితే రెండిటినీ పక్కన పెట్టి చూస్తే మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్. మామూలుగానే అందగాడైన మహేష్ క్లోజప్ షాట్స్ లో మరింత క్రేజీగా అనిపిస్తాడు. మౌంటెన్ డ్యూ యాడ్ లో హృతిక్ రోషన్ కన్నా మహేష్ లుక్స్ అదిరిపోయాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

మన స్టార్స్ కి ఇప్పటికే నేషనల్ వైడ్ ఫాలోయింగ్ పెరిగింది. సినిమాలతో పాటుగా యాడ్స్ లో కూడా బాలీవుడ్ స్టార్స్ కి పోటీ ఇస్తున్నారు సౌత్ స్టార్స్. ఈ క్రమంలో మౌంటెన్ డ్యూ యాడ్ లో మహేష్ లుక్స్ పై ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.